Share News

మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారమే లేదు

ABN , Publish Date - Jun 01 , 2026 | 06:00 AM

మెగా డీఎస్సీ-2025ను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో కట్టుదిట్టమైన భద్రత, నిఘా, పర్యవేక్షణ వ్యవస్థల మధ్య నిర్వహించామని, మాస్‌ కాపీయింగ్‌ జరిగే ఆస్కారమే లేదని..

మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారమే లేదు

  • సీబీటీ విధానంలోనే డీఎస్సీ-2025 నిర్వహణ

  • టీచర్‌ నియామకాలన్నీ చట్టబద్ధంగానే జరిగాయి

  • పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025ను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో కట్టుదిట్టమైన భద్రత, నిఘా, పర్యవేక్షణ వ్యవస్థల మధ్య నిర్వహించామని, మాస్‌ కాపీయింగ్‌ జరిగే ఆస్కారమే లేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహణలో మాస్‌ కాపీయింగ్‌ జరిగినట్లు జగన్‌ మీడియాలో ప్రచురితమైన కథనంపై ఆమె ఆదివారం వివరణ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాల్లో 11 మంది అభ్యర్థులను మాస్‌ కాపీయింగ్‌ కారణంగా అనర్హలుగా ప్రకటించారనే ఆరోపణలు తప్పని కొట్టిపారేశారు. సీబీటీ ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కంప్యూటర్‌ టెర్మినల్స్‌, డిజిటల్‌ మానిటరింగ్‌, ప్రామాణిక పరీక్షా నిబంధనలు ఉంటాయని వివరించారు. పరీక్ష నిర్వహణ సమయంలో పరీక్షా కేంద్రం నుంచి, పరిశీలన అధికారుల నుంచి, పర్యవేక్షణ సంస్థల నుంచి మాస్‌ కాపీయింగ్‌కు సంబంధించిన నివేదికలు రాలేదని తేల్చి చెప్పారు. అలానే కొణతాల రోజామణి... బీసీ-డి విభాగంలో మెరిటోరియస్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ లిస్ట్‌లో ఉండడం వల్ల ఎంపిక కాలేదని వివరించారు. అధికారిక రికార్డులను పరిశీలించగా మెగా డీఎస్సీ-2025 నియమాక ప్రక్రియ అంతా చట్టబద్ధమైన విధానాల ప్రకారమే జరిగిందన్నారు. నియామక ప్రక్రియలో కీలకమైన పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, ఎంపిక విధానాలు, హారిజంటల్‌ రిజర్వేషన్ల అమలు, ఎంఎ్‌సపీ రిజర్వేషన్లు, గ్రీవెన్స్‌ పరిష్కార వ్యవస్థలన్నీ సమర్థులైన అధికారుల ద్వారా నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరిగాయని అన్సారియా స్పష్టం చేశారు.

Updated Date - Jun 01 , 2026 | 06:01 AM