Share News

రిజిస్ట్రేషన్‌ లేకుండా వైద్యసేవలు కుదరదు

ABN , Publish Date - Jul 19 , 2026 | 03:30 AM

డాక్టర్ల సమయం వృథా కాకుండా, రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌..

రిజిస్ట్రేషన్‌ లేకుండా వైద్యసేవలు కుదరదు

  • ఏపీఎంసీ ఆధ్వర్వంలో విశాఖలో వైద్యుల రిజిస్ర్టేషన్లు ప్రారంభం

అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): డాక్టర్ల సమయం వృథా కాకుండా, రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌, రెన్యువల్స్‌ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గార్లపాటి నందకిశోర్‌ తెలిపారు. ఇందులోభాగంగా ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ విశాఖపట్నంలో రెండురోజులపాటు నిర్వహించే డాక్టర్ల రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.వి.సుబ్బానాయుడు, 95 ఏళ్ల సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ చిట్టి పంతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నందకిశోర్‌ మాట్లాడుతూ ఎన్‌ఎంసీ, ఏపీఎంసీ చట్టం ప్రకారం.. అల్లోపతి వైద్యులు చెల్లుబాటయ్యే రిజిస్ట్రేషన్‌ లేదా రెన్యువల్‌ లేకుండా వైద్య సేవలందించడం చట్టవిరుద్ధమని తెలిపారు. కొంతమంది వైద్యుల కోసం జిల్లా స్థాయిలో డాక్టర్ల రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు.

Updated Date - Jul 19 , 2026 | 03:30 AM