మెడికల్ కాలేజీల్లో 17 అనుబంధ కోర్సులు
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:19 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ‘జాతీయ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ కమిషన్’ గుర్తింపు పొందిన 17 అనుబంధ ఆరోగ్య కోర్సులను..
అమరావతి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ‘జాతీయ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ కమిషన్’ గుర్తింపు పొందిన 17 అనుబంధ ఆరోగ్య కోర్సులను (అలైడ్ హెల్త్ కోర్సులు) దశల వారీగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యామని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలం సీఈ డాక్టర్ పీ చంద్రశేఖర్ తెలిపారు. హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు ప్రవేశపెట్టే ప్రతిపాదనలపై సోమవారం సమీక్ష నిర్వహించారు.