అప్పనంగా అద్దె కట్టారు
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:30 AM
వైసీపీ హయంలో ప్రభుత్వ అధికారుల దుబారా, నిర్లక్ష్యం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. కా ర్యాలయం కోసం విశాఖలో ఓ భవంతిని అద్దెకు తీసుకుని..
2019లో కాకినాడ నుంచి విశాఖకు మెరైన్ బోర్డు
అక్కడికి వెళ్లని అధికారులు.. మంగళగిరి నుంచే విధులు
అప్పటి నుంచి విశాఖలో నెలకు 12 లక్షల అద్దె
మంగళగిరిలోనూ అద్దె బిల్డింగ్‌లోనే.. నేడు దిద్దుబాటు
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయంలో ప్రభుత్వ అధికారుల దుబారా, నిర్లక్ష్యం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. కా ర్యాలయం కోసం విశాఖలో ఓ భవంతిని అద్దెకు తీసుకుని.. ఆ భవంతిని ఖాళీగా ఉంచి ఏళ్ల తరబడి అద్దె చెల్లించారు. అంతేకాదు మరో భవంతిని మంగళగిరిలో అద్దెకు తీసు కుని అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసా గిస్తున్నారు. ఇలా రెండు చోట్ల రెంట్ చెల్లిస్తూ ప్రజా ధనాన్ని వృథా చేశారు. ఆంధ్రప్రదేశ్ మెరైన్ బోర్డు(ఏపీఎంబీ) కేంద్ర కార్యాలయం 2019 వరకూ కాకినాడలో ఉండేది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక దాన్ని విశాఖకు మార్చారు. అధికారులు మాత్రం మంగళ గిరిలో ఒక అద్దె భవనం నుంచి కార్యాల యాన్ని నడుపుతూ వచ్చారు. విశాఖలో నెల కు రూ.12 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తూ వస్తున్నారు. ఇటీవల ఎంపీఎంబీ కార్యకలా పాలపై ఎంటీ కృష్ణబాబు సమీక్ష నిర్వహిం చినప్పుడు సమాచారం బయటకు వచ్చింది. విశాఖ భవనాన్ని ఖాళీ చేసి, మంగళగిరి భవనాన్ని కార్యాలయంగా ప్రకటించారు.