Share News

విలువ జోడింపులో ఏపీ మామిడికి మొదటి స్థానం

ABN , Publish Date - May 08 , 2026 | 04:54 AM

జాతీయ స్థాయిలో పంటలకు విలువ జోడింపులో ఏపీ మామిడి పండ్లు ప్రథమ స్థానం పొందాయి. ముడి పదార్ధాల్లోనూ, శుద్ధి చేసి, ప్యాకింగ్‌ చేయడంలోనూ రాష్ట్రంలో పండిన..

విలువ జోడింపులో ఏపీ మామిడికి మొదటి స్థానం

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో పంటలకు విలువ జోడింపులో ఏపీ మామిడి పండ్లు ప్రథమ స్థానం పొందాయి. ముడి పదార్ధాల్లోనూ, శుద్ధి చేసి, ప్యాకింగ్‌ చేయడంలోనూ రాష్ట్రంలో పండిన మామిడి కాయలకు దేశంలో అగ్ర స్థానం లభించింది. 30.67శాతం మామిడి పండ్లు ఏపీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. జాతీయ స్థాయిలో ఆహార శుద్ధిని నిర్ధారించడానికి డెలియిల్‌ చేసిన అధ్యయనం, పశుసంవర్ధక శాఖ గణాంకాలు, ఎంపెడా నివేదికల ప్రకారం కోడిగుడ్లు, పౌల్ర్టీ ఉత్పత్తుల ముడి వస్తువుల్లో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచినా.. శుద్ధి విషయంలో 8 స్థానం దక్కించుకున్నాయి. రాష్ట్రానికి చెందిన మత్స్య ఉత్పత్తి, సముద్ర రొయ్యలు ముడి పదార్ధాల్లో తొలి స్థానంలో ఉన్నా.. శుద్ధి విషయంలో సముద్ర రొయ్యలు మూడో స్థానంతో జాతీయ స్థాయిలో 18.98శాతం ఉత్పత్తి అందిస్తుండగా, చేపలు 25.27శాతం ఉత్పత్తి అందిస్తున్నాయి. శుద్ధి విషయంలో వరి ధాన్యం(బియ్యం), పాలు, కూరగాయలు, వేరుశనగ రెండో స్థానం, మాంసం నాలుగో స్థానం, చెరకు, జొన్న, మొక్కజొన్న, సజ్జ ఏడో స్థానం, పప్పు ధాన్యాలు తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వాల్యూ ఎడిషన్‌ అంశం ప్రస్తావన సందర్భంగా వ్యవసాయ అధికారులు ఈ విషయాలను నివేదించారు.

Updated Date - May 08 , 2026 | 04:55 AM