భక్తునికి భగవంతుడికి వారధి ‘మనమిత్ర’
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:34 AM
భగవంతుడి సేవకు వెళ్లే భక్తులకు మనమిత్ర యాప్ తోడ్పాటునిస్తోంది. మనమిత్ర యాప్‌లో దేవాలయ దర్శన టికెట్లను అందుబాటులోకి ...
ఆన్‌లైన్‌లో ఆలయాల దర్శన టికెట్లు
అమరావతి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): భగవంతుడి సేవకు వెళ్లే భక్తులకు మనమిత్ర యాప్ తోడ్పాటునిస్తోంది. మనమిత్ర యాప్‌లో దేవాలయ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురావడంతో చాలామంది భక్తులు ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్‌తో ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ యాప్ ద్వారా తిరుమల శ్రీవారి ఆలయం మినహా రాష్ట్రంలోని 21 ప్రధాన ఆలయాల్లో దర్శనాలకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ యాప్ ద్వారా టికెట్ల బుకింగ్ వల్ల నెల రోజుల్లో దేవదాయ శాఖకు రూ.22.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఆలయాల్లో దర్శనం, ఆర్జిత సేవలు, తలనీలాల టికెట్లతోపాటు హుండీలో మొక్కులు చెల్లించేలా నగదు చెల్లింపులు మనమిత్ర యాప్‌తో అందుబాటులోకి వచ్చాయి.