Share News

రోడ్లు తవ్వాలంటే అనుమతి తప్పనిసరి

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:15 AM

రహదారులు తవ్వడానికి ముందు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలంటూ ఐటీ శాఖ జీవో సంఖ్య 7ను జారీ చేసింది.

రోడ్లు తవ్వాలంటే అనుమతి తప్పనిసరి

  • సీబీయూడీ యాప్‌లో వివరాలు నమోదు: ఐటీ శాఖ

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): రహదారులు తవ్వడానికి ముందు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలంటూ ఐటీ శాఖ జీవో సంఖ్య 7ను జారీ చేసింది. దీనికోసమే రూపొందించిన ‘కాల్‌ బిఫోర్‌ యూ డిగ్‌‘(సీబీయూడీ) యాప్‌ను రూపొందించినట్లు ఆ జీవోలో పేర్కొంది. ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ రూల్స్‌ 2022 మేరకు కేంద్ర టెలి కమ్యూనికేషన్స్‌ శాఖ కొన్ని సూచనలతో కూడిన ఉత్తర్వు జారీ చేసింది. ఆ నేపథ్యంలో జీవో జారీచేస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.

Updated Date - Apr 17 , 2026 | 04:16 AM