Share News

ముఖ హాజరు ఉంటేనే అఫిలియేషన్‌

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:35 AM

వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు, సిబ్బందికి ముఖ ఆధారిత హాజరు(ఎఫ్ఆర్‌ఎస్)ను అమలు చేయాలని నిర్ణయించిన ఉన్నత విద్యాశాఖ..

ముఖ హాజరు ఉంటేనే అఫిలియేషన్‌

  • ఫ్యాకల్టీ అందరికీ రిజిస్ర్టేషన్‌ తప్పనిసరి

  • కాలేజీలకు ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు, సిబ్బందికి ముఖ ఆధారిత హాజరు(ఎఫ్ఆర్‌ఎస్)ను అమలు చేయాలని నిర్ణయించిన ఉన్నత విద్యాశాఖ.. తాజాగా కాలేజీల గుర్తింపునకు(అఫిలియేషన్‌) కూడా దీనిని వర్తింపచేయనుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అఫిలియేషన్‌పై తాజాగా మార్గదర్శరకాలు జారీచేసింది. ఎఫ్‌ఆర్‌ఎస్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సంస్థలకే అఫిలియేషన్లు, అడ్మిషన్ల కౌన్సిలింగ్‌ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది. సిబ్బంది పేర్లను ‘లీప్‌ హయ్యర్‌’ యాప్‌లో నమోదు చేయించాలి. సిబ్బంది వారి ఫోన్ల ద్వారా ముఖ హాజరు వేస్తారు. విద్యార్థులకు మాత్రం కాలేజీల ఫోన్లతో ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు చేస్తారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు ముఖ ఆధారిత హాజరును అమలు చేస్తారు.

అఫిలియేషన్లకు నోటిఫికేషన్‌: డిగ్రీ కాలేజీల అఫిలియేషన్లకు ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అద్దె భవనాల్లో ఉన్న డిగ్రీ కాలేజీలకు 30ఏళ్ల కాలం వరకు అనుమతులు ఇవ్వనున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 04:37 AM