లోక్ అదాలత్‌లకు విశేష స్పందన
ABN , Publish Date - Mar 15 , 2026 | 05:48 AM
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే 2,95,182 కేసులు పరిష్కారం అయ్యాయి.
ఒక్కరోజే 2,95,182 కేసుల పరిష్కారం
అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే 2,95,182 కేసులు పరిష్కారం అయ్యాయి. మొత్తం రూ.87.35 కోట్ల పరిహారం అందజేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్ సి.హెచ్.మానవేంద్రనాథ్‌రాయ్, హైకోర్టు న్యాయసేవల కమిటీ అధ్యక్షులు జస్టిస్ ఎన్.రవినాథ్ తిల్హరి మార్గదర్శకంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దిగువ న్యాయస్థానాలో 400 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు. ఇరువర్గాల ఆమోదంతో రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించారు. ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ వై.లక్ష్మణరావు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న158 కేసులు పరిష్కరించి, రూ.3.36 కోట్ల పరిహారం అందజేశారు. అదేవిధంగా విశాఖపట్టణం రుణాల రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ) విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన బెంచ్‌లో 21 కేసులు పరిష్కరించి, రూ.21.15 కోట్లు పరిహారం చెల్లించుటకు అవార్డులు జారీ చేశారు.