Share News

‘స్థానికం’లో విజయమే లక్ష్యం

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:30 AM

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూట మి పార్టీలు ముందుకు సాగాలని ఎన్డీయే పక్షాల సమావేశంలో నాయకులు నిర్ణయం తీసుకున్నారు.

‘స్థానికం’లో విజయమే లక్ష్యం

  • క్షేత్రస్థాయిలోనూ సమన్వయం ఉండాలి

  • పార్లమెంటు, అసెంబ్లీ స్థాయిలో కమిటీలు

  • 18 నాటికి ఏర్పాటు చేయాలని నిర్ణయం

  • కూటమి సమన్వయ కమిటీ నిర్ణయం

అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూట మి పార్టీలు ముందుకు సాగాలని ఎన్డీయే పక్షాల సమావేశంలో నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 3 పార్టీలూ మ రింత సమన్వయంతో ముందుకు సాగాలని అనుకున్నారు. అధినాయకుల స్థాయిలో మంచి సమన్వయం ఉన్నా.. క్షేత్రస్థాయిలో అది ప్రతిబింబించడం లేదని, దీన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూటమి నేతలు చర్చించారు. బుధవారం రాత్రి ఎన్డీ యే కూటమి పక్షాల సమన్వ య కమిటీ సమావేశం జరిగిం ది. తాడేపల్లిలోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, మంత్రి సత్యకుమార్‌, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నిక ల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై సుదీర్ఘ చర్చ జరిగింది. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు సమన్వయ కమిటీలు ఏర్పా టుపై చర్చించారు. ముందుగా.. పార్లమెంటు లేదా జిల్లా స్థాయిలో ఓ కమిటీ అసెంబ్లీ స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయాల ని నిర్ణయించారు. పార్లమెంటు లేదా జిల్లా కమిటీలో మూడు పార్టీల జిల్లా అధ్యక్షులు, ఎంపీ, ఆ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇన్‌చార్జు లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలో సుమారు 27 మంది ఉంటారు. తర్వాత అసెంబ్లీస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తారు. దీనిలో కూటమి పార్టీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జులు సభ్యులుగా ఉంటారు. 3 పార్టీలకు చెందిన మండల పా ర్టీల అధ్యక్షులూ ఈ కమిటీలోనే సభ్యులుగా ఉంటారు.


దీంతో మండల స్థాయి కమిటీల అవసరం ఉండదని నేతలు అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో సమన్వయ బాధ్యతను ఈ కమిటీలు తీసుకోవాలి. జోనల్‌ స్థాయిలో నూ సమన్వయ కమిటీల ఏర్పాటుపై ఈ భేటీలో చర్చ జరిగినా.. ఒక్క టీడీపీలో తప్ప మిగిలిన రెండు పార్టీల్లో జోనల్‌ వ్యవస్థ లేకపోవడంతో ఈ కమిటీలు అవసరం లేదని భావించారు. రాష్ట్రస్థాయిలో ప్రస్తుత సభ్యుల తో ఉన్న సమన్వయ కమిటీ ప్రతి 2 వారాలకు ఒకసారి భేటీ కావాలని నిర్ణయించారు. పార్లమెంటు, అసెంబ్లీ సమన్వయ కమిటీలను 18 నాటికి ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Jul 16 , 2026 | 05:31 AM