Share News

బీసీలకు 34శాతం రిజర్వేషన్‌ హర్షణీయం

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:13 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల(బీసీ)కు 34 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానంపై ఆంధ్రప్రదేశ్‌ బీసీ ఉద్యోగుల..

బీసీలకు 34శాతం రిజర్వేషన్‌ హర్షణీయం

  • ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్‌

విశాఖపట్నం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల(బీసీ)కు 34 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానంపై ఆంధ్రప్రదేశ్‌ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు బుధవారం హర్షం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వం కేవలం 24 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం వల్ల అన్ని స్థానిక సంస్థల్లో మొత్తం 16 వేల రాజకీయ పదవులను బీసీలు కోల్పోయారని గుర్తుచేశారు. ఇప్పుడు 34 శాతం వల్ల బీసీలకు రాజకీయంగా ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలియజేశారు.

Updated Date - Aug 20 , 2026 | 04:17 AM