ఆ ముగ్గురిని కస్టడీకి ఇవ్వండి
ABN , Publish Date - Jul 22 , 2026 | 04:45 AM
వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసులో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు..
వైసీపీ ‘మద్యం రవాణా’ కేసులో సిట్ పిటిషన్
విజయవాడ, జూలై 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసులో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి(ఏ1), కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (ఏ4), కారుమూరి సునీల్ (ఏ8)కు ఏసీబీ కోర్టు రెండు రోజుల క్రితం రిమాండ్ విధించింది. ప్రస్తుతం వారు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.