ఆ ముగ్గురి కస్టడీపై నేడు నిర్ణయం!
ABN , Publish Date - Jul 01 , 2026 | 04:56 AM
ఏపీ మద్యం అక్రమ రవాణా కేసులో కీలక నిందితులైన రాజ్ కసిరెడ్డి, డి.వాసుదేవరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ను..
కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కారుమూరి సునీల్‌ను వారం కస్టడీకి ఇవ్వాలని కోరిన ఈడీ
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఏపీ మద్యం అక్రమ రవాణా కేసులో కీలక నిందితులైన రాజ్ కసిరెడ్డి, డి.వాసుదేవరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ను విచారణ నిమిత్తం వారం రోజులు కస్టడీకి ఇవ్వాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనపై హైదరాబాద్‌లోని ఈడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తన నిర్ణయం వెలువరించనుంది.