రేషన్ దుకాణాల్లో ‘మీ మార్ట్’లు
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:22 AM
రేషన్ డీలర్ల ఆర్థిక స్వావలంబనను పెంపొందించే లక్ష్యంతో ‘మీ మార్ట్ (నీది.. నాది.. మనందరిది)’ పేరుతో రేషన్ దుకాణాల్లో మినీ మార్ట్‌లను...
గుంటూరులో ప్రారంభించిన మంత్రి నాదెండ్ల
గుంటూరు, జూలై 6(ఆంధ్రజ్యోతి): రేషన్ డీలర్ల ఆర్థిక స్వావలంబనను పెంపొందించే లక్ష్యంతో ‘మీ మార్ట్ (నీది.. నాది.. మనందరిది)’ పేరుతో రేషన్ దుకాణాల్లో మినీ మార్ట్‌లను ప్రారంభిస్తున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని లాలూపురంలో స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులుతో కలిసి మంత్రి మినీ మార్టును ప్రారంభించారు. ప్రజలకు ఒకే చోట నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందుబాటు ధరలకు అందించడమే ఈ మార్టుల ప్రధాన ఉద్దేశమన్నారు. వీటిలో 60 రకాల సరుకులతో ప్రారంభించి, రాబోయే రోజుల్లో 250 రకాల నాణ్యమైన సరుకులను అందిస్తామన్నారు.