కేజీబీవీల్లో ఉద్యోగాలకు ‘టెట్’ వెసులుబాటు
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:11 AM
కేజీబీవీల్లో బోధనా ఉద్యోగాల నోటిఫికేషన్‌లో కీలక మార్పు చేసినట్లు సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.
అమరావతి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): కేజీబీవీల్లో బోధనా ఉద్యోగాల నోటిఫికేషన్‌లో కీలక మార్పు చేసినట్లు సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు సమయానికి టెట్ అర్హత లేకపోయినా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత ఏడాదిలోపు ఏపీటెట్‌లో అర్హత సాధించాలని వివరించారు. నిర్ణీత గడువులోగా టెట్ అర్హత సాధించకపోతే ఎలాంటి నోటీసులు లేకుండానే ఆటోమేటిక్‌గా వారి సేవలను నిలిపివేస్తారని తెలిపారు. అలాగే దరఖాస్తుల గడువును ఈనెల 20 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.