Share News

నేడు జేఎల్స్‌కు పదోన్నతులు

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:08 AM

జూనియర్‌ లెక్చరర్లకు డిగ్రీ లెక్చరర్లుగా శనివారం పదోన్నతులు లభించనున్నాయి. డీఎల్‌గా వెళ్లేందుకు 200 మంది జేఎల్స్‌ ఆసక్తిని తెలిపారు.

నేడు జేఎల్స్‌కు పదోన్నతులు

  • పదోన్నతి పొందినా ఆ కాలేజీల్లోనే విధులు

అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): జూనియర్‌ లెక్చరర్లకు డిగ్రీ లెక్చరర్లుగా శనివారం పదోన్నతులు లభించనున్నాయి. డీఎల్‌గా వెళ్లేందుకు 200 మంది జేఎల్స్‌ ఆసక్తిని తెలిపారు. ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్‌ అధికారులు వారికి శనివారం కౌన్సెలింగ్‌ నిర్వహించి పదోన్నతులు కల్పిస్తారు. వెంటనే డిగ్రీ కాలేజీల్లో పోస్టింగ్‌ ఇస్తారు. అయితే డీఎల్స్‌గా పదోన్నతి పొందినా ఏడాదిపాటు జూనియర్‌ కాలేజీల్లోనే బోధించేలా విద్యాశాఖ వారి నుంచి సమ్మతి తీసుకుంది. దీంతో నేడు పద్నోనతి, పోస్టింగ్‌లు వచ్చినా ఏడాదిపాటు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగుతారు. డీఎల్స్‌గా వెళ్లడంవల్ల జీతం తగ్గిపోతుందని కొందరు జేఎల్స్‌ ముందుకు రాలేదు. ఇప్పుడు పదోన్నతి పొందేవారు జూనియర్‌ డీఎల్స్‌ అవుతారు. వారికంటే సీనియర్‌ జేఎల్స్‌కు పే స్కేలు ఎక్కువగా ఉంది. అందువల్ల పదోన్నతులకు కొందరు ముందుకురాలేదు.

Updated Date - Jul 11 , 2026 | 05:09 AM