నేటి నుంచి జూనియర్ డాక్టర్ల నిరసనలు
ABN , Publish Date - Aug 10 , 2026 | 03:58 AM
ప్రభుత్వ వైద్య భోదన ఆసుపత్రుల్లో పని చేసే జూనియర్ డాక్టర్లకు ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి జూడాలు నిరసన కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు.
గుంటూరు మెడికల్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య భోదన ఆసుపత్రుల్లో పని చేసే జూనియర్ డాక్టర్లకు ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి జూడాలు నిరసన కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. తమ డిమాండ్ల సాధనకు నేరుగా సమ్మెకు దిగకుండా.. దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(ఆబ్జుడా) నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్నీలు, స్పెషాలిటీ/సూపర్ స్పెషాలిటీ మెడికల్ పీజీ విద్యార్థులు, జూనియర్, సీనియర్ రెసిడెంట్లు సోమవారం నుంచి నల్లరిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతారని ఆబ్జుడా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ శంకర్ తెలిపారు.