Share News

దివ్యాంగుల హక్కులపై అవగాహన సదస్సు

ABN , Publish Date - Feb 22 , 2026 | 03:57 AM

మంగళగిరి మండలం కాజ వద్ద గల ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీలో శనివారం దివ్యాంగుల హక్కులకు సంబంధించిన అంశాలపై న్యాయమూర్తులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.

దివ్యాంగుల హక్కులపై అవగాహన సదస్సు

మంగళగిరి సిటీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): మంగళగిరి మండలం కాజ వద్ద గల ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీలో శనివారం దివ్యాంగుల హక్కులకు సంబంధించిన అంశాలపై న్యాయమూర్తులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఏపీ హైకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సును ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ అధ్యక్షుడు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి ప్రారంభించి విలువైన సూచనలు అందించారు. డబ్ల్యూడీఏటీ, ఎస్సీ విభాగం మాజీ డైరెక్టర్‌ బీడీవీ ప్రసాదమూర్తి, డాక్టర్‌ ఎన్‌.జేసురత్న కుమార్‌ సెన్సిటైజేషన్‌, యాక్సెసిబిలిటీ, సమగ్ర విద్య, న్యాయ నిర్ణయాలలో ఉత్తమ పద్ధతులు, దివ్యాంగుల హక్కుల చట్టం-2016పై అవగాహన కల్పించారు. సదస్సులో ఏపీజేఏ డైరెక్టర్‌ సి.పురుషోత్తమ కుమార్‌ చింతలపూడి, అదనపు డైరెక్టర్‌ ఎల్‌.శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 03:58 AM