Share News

మైనార్టీలకు పోటీ పరీక్షల ఉచిత శిక్షణ

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:01 AM

రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌-2026 ప్రకటించిన నేపథ్యంలో పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు.

మైనార్టీలకు పోటీ పరీక్షల ఉచిత శిక్షణ

  • ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో ఏర్పాట్లు: మంత్రి ఫరూక్‌

అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌-2026 ప్రకటించిన నేపథ్యంలో పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. జాబ్‌ క్యాలెండర్‌లో భర్తీ చేయనున్న 10,060 పోస్టులకు పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ అభ్యర్థులకు సీఈడీఎం(సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ మైనార్టీస్‌) ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గతేడాది నిర్వహించిన డీఎస్సీకి కూడా ఉచిత శిక్షణ అందజేశామని, 1650 మంది మైనార్టీ అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారని తెలిపారు. మైనార్టీ అభ్యర్థుల్లో అత్యధిక శాతం పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నారని, ఉచిత శిక్షణ వారికి దోహదం చేస్తుందని వివరించారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2, వివిధ శాఖల్లో ఇంజనీరింగ్‌ పోస్టులు, ఉపాధ్యాయ, పోలీస్‌, సంక్షేమశాఖల్లోన్ని ఖాళీలు, తదితర పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలకు మైనార్టీ అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆయా పోస్టులకు నోటిఫికేషన్ల జారీ అనంతరం ఉచిత శిక్షణకు సంబంధించిన కార్యాచరణ షెడ్యూల్‌ను వెల్లడిస్తామని తెలిపారు.

Updated Date - Aug 24 , 2026 | 06:03 AM