Share News

ఏఈవోల సమస్యల పరిష్కారానికి కృషి: విద్యాసాగర్‌

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:59 AM

రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యలపై ఏపీ జేఏసీ పోరాడుతుందని ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు విద్యాసాగర్‌ చెప్పారు.

ఏఈవోల సమస్యల పరిష్కారానికి కృషి: విద్యాసాగర్‌

అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యలపై ఏపీ జేఏసీ పోరాడుతుందని ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు విద్యాసాగర్‌ చెప్పారు. ఆదివారం విజయవాడలోని ఎన్జీవో హోంలో విద్యాసాగర్‌ను వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘ కార్యవర్గం కలిసింది. తమ జాబ్‌ చార్ట్‌, హోదా మార్పుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఎన్జీవో నేత హామీ ఇచ్చినట్లు ఏఈవోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవరావు తెలిపారు.

Updated Date - Feb 23 , 2026 | 04:59 AM