Share News

అధికారులపై పేర్ని వ్యాఖ్యలు సరికాదు: ఏపీజేఏసీ

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:28 AM

ప్రభుత్వ అధికారులపై వైసీపీ నేత పేర్ని నాని చేస్తున్న అవమానకరమైన, వ్యంగ్యమైన, బెదిరింపు వ్యాఖ్యలను ఏపీ జేఏసీ అమరావతి తీవ్రంగా ఖండించింది.

అధికారులపై పేర్ని వ్యాఖ్యలు సరికాదు: ఏపీజేఏసీ

విజయవాడ(గాంధీనగర్‌), ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అధికారులపై వైసీపీ నేత పేర్ని నాని చేస్తున్న అవమానకరమైన, వ్యంగ్యమైన, బెదిరింపు వ్యాఖ్యలను ఏపీ జేఏసీ అమరావతి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్‌ చైర్మన్‌ ఫణి పేర్రాజు, కోశాధికారి నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కృష్ణా జిల్లాలో రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌ అధికారులపై పేర్ని చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు.

Updated Date - Apr 06 , 2026 | 05:28 AM