Share News

కోళ్లు, గుడ్లు ఇతర రాష్ట్రాల నుంచి తేవొద్దు

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:35 AM

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందిన నేపథ్యంలో ఏపీ సరిహద్దు జిల్లాల పౌల్ర్టీ రైతులు జీవ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ...

కోళ్లు, గుడ్లు ఇతర రాష్ట్రాల నుంచి తేవొద్దు

  • వాటి రవాణాకు అనుమతి తప్పనిసరి

  • పశు సంవర్ధకశాఖ డైరెక్టర్‌ సూచన

అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందిన నేపథ్యంలో ఏపీ సరిహద్దు జిల్లాల పౌల్ర్టీ రైతులు జీవ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ దామోదర్‌ నాయుడు కోరారు. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు, కోడిగుడ్లు, పౌల్ర్టీ ఉత్పత్తులను రాష్ట్రంలోకి తీసుకురావద్దని స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని కోళ్ల ఫారాల్లో జీవ భద్రతా ప్రమాదాలు కచ్చితంగా పాటించాలన్నారు. కోళ్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, కోడి మాంసం, గుడ్లు బాగా ఉడకబెట్టి తినాలని సూచించారు. తెలంగాణ సరిహద్దు జిల్లాల పశుసంవర్ధకశాఖ యంత్రాంగం కోళ్లు, కోడిగుడ్ల రవాణాను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.

Updated Date - Mar 10 , 2026 | 04:36 AM