Share News

సాగునీటికి పెద్దపీట

ABN , Publish Date - Feb 15 , 2026 | 05:16 AM

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పరుగులు పెట్టేలా జల వనరుల శాఖకు 2026-27 వార్షిక బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం లభించింది.

సాగునీటికి పెద్దపీట

  • జలవనరుల శాఖకు 18,223 కోట్లు

  • ఇందులో పోలవరానికి 6,105 కోట్లు

  • ప్రాధాన్య పథకాలకు అధిక కేటాయింపులు

అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పరుగులు పెట్టేలా జల వనరుల శాఖకు 2026-27 వార్షిక బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం లభించింది. ప్రాధాన్య ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ రూ.18,223.67 కోట్లను కేటాయించారు. 2025-26 బడ్జెట్‌ కేటాయింపుల కంటే ఇది 204 కోట్లు మాత్రమే అదనం. వాస్తవానికి ప్రాధాన్య ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు రూ.48,488 కోట్లు కావాలని జల వనరుల శాఖ అభ్యర్థించింది. అయితే ప్రాధాన్య ప్రాతిపదికన రూ.18,223,67 కోట్లను ఆర్థిక శాఖ కేటాయించింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు తప్ప మిగతా మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల వాటా రూ.9,906 కోట్లు. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు తొలిదశను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో.. 2026-27 సంవత్సరానికి రూ.6,105 కోట్లు కేటాయించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయాలని జల వనరుల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలను తరలిస్తూనే.. అటు ఉత్తరాంధ్రలోని వంశధార-నాగావళి నదుల అనుసంధాన పథకాలను చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాజెక్టుల నిర్వహణ, వర ద నియంత్రణ, డ్రైనేజీ పనులకు 450 కోట్లు కేటాయించింది.

Updated Date - Feb 15 , 2026 | 05:17 AM