ఐపీటీవీ సేవల పునరుద్ధరణ
ABN , Publish Date - May 19 , 2026 | 05:42 AM
ఏపీ ఫైబర్‌నెట్ అందిస్తున్న ఐపీటీవీ సేవలు పునరుద్ధరించినట్టు ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు.
ప్రొవైడర్లకు బకాయిలు లేవు: ఎండీ
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
గుంటూరు, మే 18(ఆంధ్రజ్యోతి): ఏపీ ఫైబర్‌నెట్ అందిస్తున్న ఐపీటీవీ సేవలు పునరుద్ధరించినట్టు ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం వచ్చిన కథనంపై ఆమె స్పందించారు. సేవల పునరుద్ధరణకు చేపట్టిన చర్యలను వివరించారు. ఏపీఎస్ఎఫ్ఎల్ చేపట్టిన సంస్థాగత, సాంకేతిక చర్యలతో పాటు, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. ఇప్పటికే ఉన్న సబ్‌స్ర్కైబర్-లింక్డ్ ఒప్పందం కింద మెస్సర్స్ కార్పస్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మిడిల్‌వేర్ అండ్ డీఆర్‌ఎం సేవలను పొందుతోందని, సర్వీస్ ప్రొవైడర్.. సబ్‌స్ర్కైబర్ రుసుముల సవరణ కోరగా దానిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అంతరాయం కలిగిందని చెప్పారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లకు ఐపీటీవీ సేవలు ఆగిపోయాయన్నారు. అయితే, సేవల కొనసాగింపునకు అవసరమైన టెక్నికల్, ఆపరేషనల్, ఒప్పందపరమైన చర్యలను ప్రారంభించామన్నారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐపీటీవీ ేసవలు సాధారణంగా పనిచేస్తున్నాయని తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్‌కు బకాయిలు లేవన్నారు.