Share News

చేపల వేటపై శిక్షణకు దరఖాస్తులు

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:19 AM

అధునిక పద్ధతులలో చేపల వేటపై టిండాల్‌ కం డ్రైవర్‌ కోర్సులో శిక్షణకు ఆగస్టు 10లోగా జిల్లాల మత్య్సశాఖ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలని..

చేపల వేటపై శిక్షణకు దరఖాస్తులు

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): అధునిక పద్ధతులలో చేపల వేటపై టిండాల్‌ కం డ్రైవర్‌ కోర్సులో శిక్షణకు ఆగస్టు 10లోగా జిల్లాల మత్య్సశాఖ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలని రాష్ట్ర మత్స్య, సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ప్రిన్సిపాల్‌ అంజలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే సెప్టెంబరు నుంచి ఏడాది పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చే ఈ కోర్సుకు ఏపీ, తెలంగాణ, పుదిచ్చేరి ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కాకినాడలోని సంస్థ కార్యాలయానికి కూడా దరఖాస్తులను పోస్టు ద్వారా పంపవచ్చునని సూచించారు. వచ్చే నెల 20న సంస్థ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు.

Updated Date - Jul 17 , 2026 | 04:20 AM