Share News

ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌ టికెట్లు విడుదల

ABN , Publish Date - May 16 , 2026 | 06:22 AM

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి పి.రంజిత్‌ బాషా శుక్రవారం తెలిపారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌ టికెట్లు విడుదల

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి పి.రంజిత్‌ బాషా శుక్రవారం తెలిపారు. మనమిత్ర వాట్సాప్‌ సేవల ద్వారా, ఏపీ ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లపై కళాశాల ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. మే 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి.

Updated Date - May 16 , 2026 | 06:23 AM