6న ఇంటర్ కాలేజీలు పునఃప్రారంభం
ABN , Publish Date - May 30 , 2026 | 05:46 AM
జూనియర్ కాలేజీల పునఃప్రారంభాన్ని ఇంటర్ విద్యామండలి వాయిదా వేసింది. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 వరకు ఉన్నందున 6న కాలేజీలు..
అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): జూనియర్ కాలేజీల పునఃప్రారంభాన్ని ఇంటర్ విద్యామండలి వాయిదా వేసింది. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 వరకు ఉన్నందున 6న కాలేజీలు పునఃప్రారంభమవుతాయని బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓవైపు కొన్ని కాలేజీల్లో పరీక్షా కేంద్రాలు ఉండటం, సిబ్బందికి పరీక్షల విధుల కేటాయించిన నేపథ్యంలో పునఃప్రారంభ తేదీని మార్చినట్లు తెలిపారు. కాగా, ఇదే విషయంపై ‘అటు పరీక్షలు... ఇటు తరగతులు’ శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది.