అడ్మిషన్ల కోసం ప్రచారం చేయొద్దు
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:29 AM
అడ్మిషన్ల కోసం హోర్డింగులు, కరపత్రాలు, గోడలపై రాతలు, మీడియా ద్వారా ప్రచారం లాంటివి చేయకూడదని ఇంటర్ విద్యామండలి ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల....
ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ విద్యామండలి ఆదేశం
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): అడ్మిషన్ల కోసం హోర్డింగులు, కరపత్రాలు, గోడలపై రాతలు, మీడియా ద్వారా ప్రచారం లాంటివి చేయకూడదని ఇంటర్ విద్యామండలి ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. మీ పిల్లలను కచ్చితంగా ఉత్తీర్ణుల్ని చేస్తామనే హామీలు ఇవ్వకూడదని ఆదేశించింది. ఇలాంటివి నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. 2026-27కు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ విద్యామండలి కార్యదర్శి పి.రంజిత్ బాషా బుధవారం విడుదల చేశారు. సెకండియర్ విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని బోర్డు తెలిపింది. జూన్ 1న తిరిగి అందరికీ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొంది. అక్టోబరులో క్వార్టర్లీ, నవంబరు చివర్లో హాఫ్ ఇయర్లీ పరీక్షలు, 2027 ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, ఫిబ్రవరి లేదా మార్చిలో పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని వివరించింది. అక్టోబరు 10 నుంచి 20 వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది.