ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:49 AM
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 12గంటలకు ఫలితాలు విడుదలవుతాయని విద్యార్థులు వారి పలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని, మనమిత్ర వాట్సాప్ నంబరుకు మెసేజ్ చేసి కూడా పొందవచ్చని వివరించింది. సప్లిమెంటరీతో పాటు రెండేళ్ల విద్యార్థుల బెటర్‌మెంట్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. సెకెండియర్ విద్యార్థుల బెటర్‌మెంట్ ఫలితాలు వచ్చాక మూడు రోజుల్లో ఈఏపీసెట్ ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.