Share News

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

ABN , Publish Date - Apr 28 , 2026 | 05:17 AM

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి పి.రంజిత్‌ బాషా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

అమరావతి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి పి.రంజిత్‌ బాషా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సోమవారంతో ఫీజు చెల్లించే గడువు ముగిసింది. ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆ గడువును 30వ తేదీ వరకు పొడిగించారు. 30 తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Apr 28 , 2026 | 05:18 AM