మూడో వారంలో ఇంటర్ ఫలితాలు
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:12 AM
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల మూడో వారంలో విడుదల చేసేందుకు ఇంటర్ విద్యామ ండలి కసరత్తు చేస్తోంది.
అమరావతి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల మూడో వారంలో విడుదల చేసేందుకు ఇంటర్ విద్యామ ండలి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తికా గా, పేపర్ల స్కానింగ్ గురువారం పూర్తయ్యింది. అనంతరం డేటాను బోర్డుకు తెప్పించుకుని మొత్తం మూల్యాంకనం ప్రక్రియను మరోసారి పరిశీలిస్తారు. ఆ తర్వాత ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా, తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 12న విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఏపీలో ఇంటర్మీడియట్‌లో సమూల మార్పులు చేసినందున ఫలితాల విడుదల కొంత ఆలస్యమైంది.