Share News

ఇంటర్‌, ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు వాయిదా

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:51 AM

రంజాన్‌ సెలవు మార్పు నేపథ్యంలో శనివారం(నేడు) జరగాల్సిన ఇంటర్‌ ఫస్టియర్‌ పబ్లిక్‌ అడ్మినిస్ర్టేన్‌, లాజిక్‌ పరీక్షలను...

ఇంటర్‌, ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు వాయిదా

అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రంజాన్‌ సెలవు మార్పు నేపథ్యంలో శనివారం(నేడు) జరగాల్సిన ఇంటర్‌ ఫస్టియర్‌ పబ్లిక్‌ అడ్మినిస్ర్టేన్‌, లాజిక్‌ పరీక్షలను ఈనెల 25న నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. హాల్‌ టికెట్‌ సహా, పరీక్షా కేంద్రం, మిగిలిన సబ్జెక్టుల పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులూ లేవని స్పష్టంచేసింది. అలాగే ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ శనివారం టెన్త్‌ విద్యార్థులకు నిర్వహించాల్సిన ఇండియన్‌ కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ పరీక్షను ఈనెల 30కి వాయిదా వేసింది.

Updated Date - Mar 21 , 2026 | 04:51 AM