చేయి చేయి కలుపుదాం... గంజాయిని తరిమేద్దాం
ABN , Publish Date - Feb 22 , 2026 | 05:15 AM
సమాజానికి ప్రమాదకరంగా ఉన్న గంజాయిని రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమేసే డ్రగ్స్‌పై యుద్ధంలో ప్ర తి ఒక్కరూ భాగస్వాములు కావాలని..
దాని సాగును పూర్తిగా అరికట్టాం.. సరఫరా గొలుసు తెగ్గొడుతున్నాం
157 కేసుల్లో జైలుకెళ్లిన 96 మంది స్మగ్లర్లు: ఈగల్ ఐజీ రవికృష్ణ
అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): సమాజానికి ప్రమాదకరంగా ఉన్న గంజాయిని రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమేసే డ్రగ్స్‌పై యుద్ధంలో ప్ర తి ఒక్కరూ భాగస్వాములు కావాలని ‘ఈగల్’ ఐజీ ఆకే రవికృష్ణ కోరారు. ఈ విభాగం 2025లో సాధించిన విజయాలు, 2026 కార్యాచరణ ప్రణాళికను విజయవాడలోని ఈగల్ కార్యాలయంలో ఆయన వివరించారు. ‘‘డ్ర గ్స్, గంజాయి సేవించే వాళ్ల గురించి, సరఫరా గురించి తెలిస్తే వెంటనే టో ల్ ఫ్రీ 1972కు సమాచారం అందించండి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా లేకుండా చేశాం. ఒడిశా నుంచి అక్రమంగా తరలి వస్తోన్న సరఫరా అడ్డుకోవడానికి 80 చెక్ పోస్టులు(35 అంతర్రాష్ట్ర) ఏర్పాటు చేశాం. ఏడాదిలో 1.12 లక్షల కిలోల గంజాయి ధ్వంసం చేశాం. పిట్-ఎన్‌డీపీఎస్ చట్టం కఠినంగా అమలు చేయడంతో 157 కేసుల్లో 96 మంది గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్లను జైలుకు పంపించాం. ప్రభుత్వం వద్ద మరో 296 మంది జాబితా పరిశీలనలో ఉంది. ‘ఆపరేషన్ చైతన్యం’ పేరుతో అనేక చర్యలు, కార్యక్రమాలు చేపట్టాం. ఓపియాయిడ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ‘ఆపరేషన్ గరుడ’ అమలు చేస్తున్నాం. అరకు ప్రాంతం నుంచి వచ్చిన సమాచారంతో 12 రాష్ట్రాల్లోని 343 మందిని గుర్తించి కట్టడి చేశాం. మరో 30 నెట్‌వర్క్‌లపై నిఘా వేశాం. ఒడిశాలోని కోరాపుట్, మల్కన్‌గిరి, గజపతి, గంజాం జిల్లాల నుంచి గంజాయి వస్తోం ది. గంజాయి స్మగ్లింగ్ సమాచారంతో 21 రైళ్లలో ‘ఈగల్ ఆన్ ట్రైన్స్’ ద్వారా తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. విద్యాసంస్థల వద్ద 45 వేల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి రూ.75 లక్షల జరిమానా విధించాం.
రాష్ట్రంలో 40 వే ల విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి 20 లక్షల మంది విద్యార్థుల కు ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటూ అవగాహన కల్పించాం. ఎన్‌డీపీఎస్ కేసుల్లో చిక్కుకుంటే బెయిల్, పాస్‌పోర్టు... ఏవీ రావని చెప్పాం. డ్రగ్స్ నెట్‌వర్క్ ఆర్థిక మూలాలపై ప్రత్యేక దృష్టి పెట్టి టెక్నాలజీతో మానిటరింగ్ చే స్తున్నాం. నార్కోటిక్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్‌తో పాటు.. ‘ఐస్ ఫర్ విజిలెన్స్.. వింగ్స్ ఫర్ జస్టిస్’ నినాదంతో 2026లో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని గంజాయి, డ్రగ్స్ సరఫరా చైనును పూర్తిగా తుంచేసే ప్రయత్నం చేస్తున్నాం’’ అని రవికృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో ఆపరేషన్స్ విభాగం ఎస్పీ కే మహేశ్వర రాజు, డీఎస్పీలు దుర్గా ప్రసాద్, సింగయ్య ఇతర అధికారులు రవీంద్ర, నాగార్జున, వీరాంజనేయులు పాల్గొన్నారు.