ఐసెట్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Aug 20 , 2026 | 04:22 AM
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్-2026లో అర్హత సాధించిన అభ్యర్థులకు బుధవారం తొలివిడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్-2026లో అర్హత సాధించిన అభ్యర్థులకు బుధవారం తొలివిడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. కౌన్సెలింగ్‌కు గురువారం(ఆగస్టు 20) నోటిఫికేషన్ జారీ చేస్తారు. 24 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన, ఫీజు చెల్లింపునకు అవకాశం. అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 25 నుంచి సెప్టెంబరు 1 వరకు సాగుతుంది. ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు. 3న వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం. సెప్టెంబరు 7న సీట్ల కేటాయింపు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబరు 8-11 వరకు కాలేజీల్లో జాయిన్ కావాలి.