పేదల ఇళ్లను వేగంగా పూర్తి చేయాలి: కొలుసు
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:57 AM
పేదల ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు.
అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల హౌసింగ్ హెడ్‌లు, డివిజనల్ అధికారులతో మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా పీఎంఏవై గృహాల నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపిక, భూ సమస్యలు, నిర్మాణ సామగ్రి సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ఇళ్ల నిర్మాణ పనులు ఆలస్యమైతే ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో సమస్యలుంటే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.