Share News

అదానీ స్కిల్స్‌తో ఉన్నత విద్యాశాఖ ఒప్పందం

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:09 AM

పరిశ్రమలు- విద్యా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు ‘ఇండస్ర్టీ కనెక్ట్‌ ఇనిషియేటివ్‌’ పేరుతో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, అదానీ స్కిల్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ మధ్య ఒప్పందం కుదిరింది.

అదానీ స్కిల్స్‌తో ఉన్నత విద్యాశాఖ ఒప్పందం

  • పరిశ్రమలకు అనుగుణంగా సాంకేతిక విద్యను మార్చేందుకు తోడ్పాటు

అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): పరిశ్రమలు- విద్యా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు ‘ఇండస్ర్టీ కనెక్ట్‌ ఇనిషియేటివ్‌’ పేరుతో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, అదానీ స్కిల్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ మధ్య ఒప్పందం కుదిరింది. గురువారం మంగళగిరిలోని ఉన్నత విద్య కమిషనర్‌ కార్యాలయంలో జరిగిన ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని డిప్లొమా విద్యార్థులకు పారిశ్రామిక విధానాలపై అవగాహన కల్పించడం, ఇంటర్న్‌షిప్‌లు, శిక్షణ, ఉపాధికి మెరుగైన మార్గాలపై కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కమిషనర్‌ భరత్‌ గుప్తా మాట్లాడుతూ, ఒప్పందం ద్వారా సాంకేతిక విద్యను పరిశ్రమల అవసరాలకు మరింత అనుగుణంగా మార్చేందుకు ఆ సంస్థ తోడ్పాటు అందిస్తుందన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 05:12 AM