Share News

ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల చట్టానికి సవరణలు

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:33 AM

కొత్త ప్రైవేటు విద్యా సంస్థల ఏర్పాటును సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య ప్రైవేటు విద్యా సంస్థల..

ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల చట్టానికి సవరణలు

  • కోర్సుల ప్రారంభానికి కార్పస్‌ ఫండ్‌ అక్కర్లేదు

కొత్త ప్రైవేటు విద్యా సంస్థల ఏర్పాటును సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య ప్రైవేటు విద్యా సంస్థల చట్టంలోని పలు నిబంధనలకు సవరణలు చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కార్పస్‌ ఫండ్‌, ఇతర నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇవ్వాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు విన్నవించగా అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. కొత్త సవరణల ప్రకారం.. కాలేజీ ఏర్పాటుచేసే సమయంలో రూ.15లక్షల కార్పస్‌ ఫండ్‌ ఉండాలి. కొత్త యూజీ, పీజీ కోర్సుల ప్రారంభానికి ప్రత్యేకంగా కార్పస్‌ ఫండ్‌ అక్కర్లేదు. 30 ఏళ్లు దాటి అద్దె భవనాల్లో కొనసాగుతున్న విద్యా సంస్థలను సొంత భవనం ఉన్న విద్యా సంస్థల తరహాలో పరిగణిస్తారు.

Updated Date - Jun 09 , 2026 | 05:34 AM