Share News

జీవీఎంసీ, ఎంఎంసీ వార్డుల పునర్విభజనపై హైకోర్టు స్టే

ABN , Publish Date - May 30 , 2026 | 05:31 AM

విశాఖపట్నం, మచిలీపట్నం మున్సిపల్‌ కార్పోరేషన్ల వార్డుల పునర్విభజన ప్రక్రియను నిలువరించాలని కోరుతూ వేర్వేరుగా దాఖలైన రెండు పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది.

జీవీఎంసీ, ఎంఎంసీ వార్డుల పునర్విభజనపై హైకోర్టు స్టే

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం, మచిలీపట్నం మున్సిపల్‌ కార్పోరేషన్ల వార్డుల పునర్విభజన ప్రక్రియను నిలువరించాలని కోరుతూ వేర్వేరుగా దాఖలైన రెండు పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల తర్వాత ఈ వ్యాజ్యాలపై రెగ్యులర్‌ బెంచ్‌ విచారణ జరుపుతుందని పేర్కొంటూ.. వార్డుల పునర్విభజన ప్రక్రియపై అప్పటి వరకు స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తుహిన్‌కుమార్‌ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. జీవీఎంసీ వార్డుల పునర్విభజనను సవాల్‌ చేస్తూ నరసింహ ప్రతాప్‌, మచిలీపట్నంలో వార్డుల పునర్విభజనపై మహ్మద్‌ ఖలేలుర్‌ రహ్మన్‌ పిటిషన్‌ వేశారు.

Updated Date - May 30 , 2026 | 05:31 AM