Share News

చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ఏం చేశారు?

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:42 AM

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీని కనుగొనేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, దర్యాప్తు పురోగతిపై స్థాయి నివేదిక సమర్పించాలని..

చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ఏం చేశారు?

  • దర్యాప్తుపై నివేదికివ్వండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీని కనుగొనేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, దర్యాప్తు పురోగతిపై స్థాయి నివేదిక సమర్పించాలని పోలీసులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తప్పిపోయిన పిల్లల దర్యాప్తునకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన స్టాండెడ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌(ఎ్‌సవోపీ) జ్ఞానేశ్వరి కేసులో పాటించారా...లేదా? అనే వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, కాకినాడ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌, తుని పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - Jun 24 , 2026 | 05:43 AM