సీబీఐ దర్యాప్తు అభ్యర్థన వెనక్కి.. కారణాలు చెప్పండి
ABN , Publish Date - Jul 16 , 2026 | 04:38 AM
గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు... అందుకు కారణాలు ఏమిటనేది చెప్పాలని..
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి హైకోర్టు ఆదేశం
ఇంటర్నెట్ డెస్క్: గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు... అందుకు కారణాలు ఏమిటనేది చెప్పాలని ఆయన తల్లి విజయలక్ష్మిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అనుబంధ పిటిషన్‌లో అభ్యర్థనలు పరస్పర విరుద్ధంగా ఉండడాన్ని ఆక్షేపించింది. సీబీఐ దర్యాప్తు అభ్యర్థనను ఉపసంహరించుకోవడానికి గల కారణాలను తాజాగా వేసే అనుబంధ పిటిషన్‌లో పేర్కొనాలని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తమ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.