విచారణ పేరుతో పదే పదే పిలవకుండా పోలీసులను నిలువరించండి
ABN , Publish Date - Jul 25 , 2026 | 04:56 AM
బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌పై నమోదైన కేసు విషయంలో గన్నవరం పోలీసులు పదేపదే తమను స్టేషన్‌కు పిలవడాన్ని సవాల్ చేస్తూ..
హైకోర్టుకు గమన, ఇంద్రసేన చౌదరి
వివరాలు సమర్పించేందుకు సమయం కోరిన ఎస్‌జీపీ
అమరావతి/విజయవాడ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌పై నమోదైన కేసు విషయంలో గన్నవరం పోలీసులు పదేపదే తమను స్టేషన్‌కు పిలవడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ నేత మద్దినేని ఇంద్రసేనచౌదరి, ప్రశ్న యూట్యూబ్ చానల్ సీఈవో గమన వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి.విష్ణుతేజ స్పందిస్తూ.. విచారణకు హాజరు కావాలని పిటిషనర్లకు నోటీసులు ఇవ్వడంతో పది రోజుల సమయం ఇవ్వాలని రాతపూర్వకంగా కోరారన్నారు. పిటిషన్ల విచారణార్హతపై వాదనలు వినిపించేందుకు, కేసుకు సంబంధించిన వివరాలు తెప్పించుకుని కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు విచారణను 29కి వాయిదా వేశారు. పిటిషనర్లను విచారణకు పిలుస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఓ మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు.