కనీసం అధ్యయనంచేయరా?
ABN , Publish Date - Jul 16 , 2026 | 04:29 AM
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు పిటిషన్ వేయడంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
అంబటిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య సాయికృష్ణ కేసులో సీబీఐ
దర్యాప్తునకు మరో పిల్ వేయడంపై అభ్యంతరం.. కొట్టివేత
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు పిటిషన్ వేయడంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే అభ్యర్థనతో ఇప్పటికే ఓ పిల్ దాఖలైందని గుర్తు చేసింది. ఒకే అంశంపై బహుళ ప్రజాహిత వ్యాజ్యాలు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. పిల్ దాఖలు గురించి తనకు అవగాహన లేదని అంబటి రాంబాబు తరఫు న్యాయవాది చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసే ముందు కనీసం అధ్యయనం చేయరా? సమాచారం తెలుసుకోరా?అవగాహన లేదని ఎలా చెబుతారు? ఈ వ్యవహారంపై ప్రతిరోజూ పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో విస్తృత కథనాలు వస్తున్నాయి. సమాచారం లేదని చెప్పడాన్ని ఆమోదించలేం.’’ అని వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ ఇప్పటికే ఓ పిల్ దాఖలైన నేపఽథ్యంలో అంబటి పిల్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.