పీజీ వైద్య విద్యార్థులతో 36 గంటలు పనిచేయిస్తారా?
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:38 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా సుపత్రులలో పనిచేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ డాక్టర్లతో నిరంతరాయంగా 36 గంటలు పని చేయించడం ఏమిటని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ..
వారికి ఉపశమనం కలిగించేందుకు ఏంచేస్తున్నారు?
పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా సుపత్రులలో పనిచేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ డాక్టర్లతో నిరంతరాయంగా 36 గంటలు పని చేయించడం ఏమిటని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ప్రశ్నించింది. వారికి ఉపశమనం కలిగించేందుకు ఏంచర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో విచారణను వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ డాక్టర్లకు వారాంతపు సెలవులు, తగినంత విశ్రాంతి సమయం లేకుండా 36గంటలపాటు పనిచేయించడాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ గుంటూరుకు చెందిన వైద్యుడు ఆల వెంకటేశ్వర్లు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది ఠాగూర్ యాదవ్ వాదనలు వినిపించారు. ఏకదాటిగా 36గంటలు పనిచేయించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం పని గంటలు 12 గంటలకు మించడానికి వీల్లేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది కల్యాణ్ వాదనలు వినిపిస్తూ... రాష్ట్రంలోని ఒక్క కళాశాలలో మాత్రమే 36 గంటలు పనిచేయిస్తున్నట్లు తమ దృష్టిలో ఉందన్నారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ వేస్తామన్నార.