ఆ మెడికల్ రిపోర్టులను మా ముందు ఉంచండి
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:47 AM
‘మాజీ ఎంపీ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలన్నింటినీ తదుపరి విచారణ నాటికి మా ముందు ఉంచండి’ అని హైకోర్టు ఆదేశించింది.
రఘురామకృష్ణరాజు కేసులో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు హైకోర్టు ఆదేశం
విచారణ రెండు వారాలకు వాయిదా
అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): ‘మాజీ ఎంపీ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలన్నింటినీ తదుపరి విచారణ నాటికి మా ముందు ఉంచండి’ అని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు హైకోర్టు న్యాయమూర్తి తర్లాడ రాజశేఖరరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. మెడికల్ రిపోర్ట్‌లను భద్రపరచాలని కోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం రికార్డులన్నీ జీజీహెచ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.