Share News

పేర్ని నానీకి నోటీసులు ఇవ్వండి

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:49 AM

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను అవమానకరంగా దూషించాననే ఆరోపణలతో తనపై మచిలీపట్నం, ఇనగుదురుపేట పోలీసులు నమోదు చేసిన కేసును....

పేర్ని నానీకి నోటీసులు ఇవ్వండి

  • పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను అవమానకరంగా దూషించాననే ఆరోపణలతో తనపై మచిలీపట్నం, ఇనగుదురుపేట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత పేర్ని నాని వేసిన క్వాష్‌ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. బీఎన్‌ఎ్‌సఎస్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేస్తూ విచారణను మార్చి 12కి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి వాయిదా వేశారు. కాగా, బాలిక అత్యాచారానికి గురై మృతిచెందిన ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శించానంటూ కోవూరు టౌన్‌ టీడీపీ అధ్యక్షుడు మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత కాకాణి గోవర్దన్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశిస్తూ.. జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి వ్యాజ్యాన్ని పరిష్కరించారు.

Updated Date - Feb 13 , 2026 | 03:49 AM