ప్రజాస్వామ్యానికి చీకటి రోజు
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:24 AM
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని హైకోర్టు న్యాయవాదులు ఖండించారు. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలిపారు.
ఢిల్లీలో పోలీసుల తీరుపై హైకోర్టు లాయర్ల ఆందోళన
అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని హైకోర్టు న్యాయవాదులు ఖండించారు. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. విద్యార్థులపై దాడిని నిరసిస్తూ శుక్రవారం హైకోర్టు వద్ద భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, న్యాయవాద సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.