Srisailam Temple: మల్లన్న సన్నిధిలో జస్టిస్ సుబేందు సమంత
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:38 AM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబేందు సమంత దంపతులు ఆదివారం దర్శించుకున్నారు.
శ్రీశైలం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబేందు సమంత దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజ లు నిర్వహించి ప్రాకారంలోని పరివార ఆలయాలు కూడా దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో జస్టిస్ సుబేందు సమంత దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు.. ఈవో శ్రీనివాసరావు పరిమళ విభూది, శేష వస్త్రాలు, ఙ్ఞాపికను అందజేశారు.