Share News

వినియోగదారుల కమిషన్‌లలో ఖాళీల భర్తీకి ఆదేశించండి

ABN , Publish Date - Feb 20 , 2026 | 04:59 AM

రాష్ట్ర, జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లలో ఖాళీగా ఉన్న అధ్యక్ష, సభ్యుల పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌)...

వినియోగదారుల కమిషన్‌లలో ఖాళీల భర్తీకి ఆదేశించండి

  • హైకోర్టులో పిల్‌.. నోటీసులు జారీ

అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర, జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లలో ఖాళీగా ఉన్న అధ్యక్ష, సభ్యుల పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారం పై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న వినియోగదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ రిజిస్ట్రార్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర, జిల్లా కమిషన్‌లలో ఖాళీగా ఉన్న అధ్యక్ష, సభ్యుల పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ వాలంటరీ కన్జ్యూమర్‌ అసిస్టెన్స్‌ నెట్‌వర్క్‌(వీసీఏఎన్‌) అధ్యక్షుడు బొమ్మిడి సన్నీరాజ్‌ ఈ పిల్‌ను దాఖలు చేశారు.

Updated Date - Feb 20 , 2026 | 05:00 AM