హైకోర్టు ‘ఉత్తర్వుల’తో ఊరట
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:01 AM
పాత గూడ్స్, ప్యాసింజర్ వాహనాలపై కేంద్రం అమాంతం పెంచిన ఫిట్‌నెస్ చార్జీలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ...
ఏపీ లారీ యజమానుల సంఘం కార్యదర్శి ఈశ్వరరావు
విజయవాడ సిటీ, జనవరి 31(ఆంధ్రజ్యోతి): పాత గూడ్స్, ప్యాసింజర్ వాహనాలపై కేంద్రం అమాంతం పెంచిన ఫిట్‌నెస్ చార్జీలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం లారీ యజమానులకు ఎంతో ఊరటనిచ్చిందని ఏపీ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు అన్నారు. కోర్టు ఉత్తర్వుల పట్ల శనివారం ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘న్యాయస్థానం తాజా ఉత్తర్వుల ప్రకారం పాత వాహనాలపై పెంచిన ఫిట్‌నెస్ ఫీజుల అదనపు ఆర్థిక భారం లారీ యజమానులపై ప్రస్తుతానికి ఉండదు’ అని ఈశ్వరరావు తెలిపారు. కేంద్రం జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.