ఓఎంఆర్ షీట్లు సిట్‌కు అప్పగించండి: హైకోర్టు
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:40 AM
వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్- 1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణలపై హై కోర్టు విచారణ కీలక దశకు చేరింది.
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్- 1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణలపై హై కోర్టు విచారణ కీలక దశకు చేరింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించేందుకు వీలుగా అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను ప్రత్యేక దర్యాప్తు బృందానికి(సిట్) ఇవ్వాలని ఆదేశించింది. అదేవిధంగా కంట్రోల్ బండిల్ స్లిప్పులను కూడా అప్పగించాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు నిర్దేశించింది. ఈ మేరకు సిట్ వేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది. ప్రస్తుతం కోర్టు నియంత్రణలో ఉన్న ఓఎంఆర్ షీట్లు, కంట్రోల్ బండిల్ స్లిప్పులను దర్యాప్తు సంస్థకు అప్పగించాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌ను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి. రమేశ్, జస్టిస్ ఆలపాటి గిరిధర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.